Tuesday, November 26, 2024

మే 6 నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు.. హాజరుకానున్న 9.07 లక్షల మంది విద్యార్థులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నేపథ్యంలో ఏర్పాటు చేయవల్సిన డిస్ట్రిక్ట్‌ ఎక్జామ్స్‌ కమిటీ (డెక్‌)లను ఇంటర్‌ విద్యా అధికారులు ఇంకా ఏర్పాటు చేయలేదని తెలిసింది. మే 6 నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వహణలో భాగంగా డెక్‌ కమిటీలు పనిచేస్తాయి. పరీక్షలకు సమయం దగ్గరపడుతోంది. ఈక్రమంలో డెక్‌ కమిటీల ఏర్పాటు ఇంకెప్పుడు చేసారని ఇంటర్‌ విద్యా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే ఇంటర్‌ వార్షిక పరీక్షలకు సబంధించిన ఏర్పాట్లను అధికారులు చేపడుతున్నారు. పరీక్షలకు 9,07,396 మంది విద్యార్థులు హాజరుకానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1443 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. హాల్‌టికెట్లను ఒకట్రెండు రోజుల్లో జారీ చేయనున్నట్లు తెలిసింది.

పది, ఇంటర్‌ పరీక్షలపై మంత్రి సబిత సమీక్ష
త్వరలో జరగబోయే పది, ఇంటర్‌, టెట్‌ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు, నిర్వహణ, ఎండల తీవ్రత దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై ఈమేరకు మంత్రి చర్చించనున్నారు. పూర్తి సమాచారంతో అధికారులు ఈసమావేశానికి హాజరు కావాలని మంత్రి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement