Tuesday, November 26, 2024

మా నాన్న ఎంపీటీసీ, నన్నే ఆపుతారా?: ట్రాఫిక్ పోలీసులను బెదిరించిన 8వ తగతి విద్యార్థి..

లైసెన్స్ లేకుండా పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు ఎంత చెప్పిన కొందరు తల్లిదండ్రులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. స్కూల్ కు వెళ్లే వారికి సైతం ద్విచక్ర వాహనాలు ఇచ్చి పంపుతున్నారు. దీంతో రోడ్డుపై స్కూటీ, బైక్ లను చాలా స్పీడ్‌గా నడుపుతూ దూసుకెళుతున్నారు. తాజాగా స్కూటీ నడుపుతున్న 8వ తరగతి విద్యార్థి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతను చెప్పిన సమాధానం విని పోలీసులే షాక్ అయ్యారు. నన్నే పట్టుకుంటావా అని ట్రాఫిక్ పోలీసులనే బెదిరించాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే… సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు పాత బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో స్కూటీపై బ్యాగులు వేసుకొని స్కూల్ కి వెళుతున్న ఓ బాలుడు వారికి కనిపించాడు. దీంతో పోలీసులు బాలుడిని ఆపి.. వివరాలు అడిగారు. శ్రీ చైతన్య పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నట్లు చెప్పాడు. స్కూటీ వేసుకొని ఎక్కడకు వెళ్తున్నావు అని పోలీసులు ప్రశ్నించగా.. రోజూ బండి మీదే స్కూల్‎కు వెళ్తానని సమాధానం ఇచ్చాడు. ఈ బండి నడపడానికి లైసెన్స్ అవసరం లేదని, మీరు నన్ను ఇలా ఆపకూడదని చెప్పాడు.

దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆ బాలుడిని గట్టిగా మందలించగా.. ‘మా నాన్న ఎంపీటీసీ, నన్నే ఆపుతారా’ అంటూ బెదిరించాడు. బాలుడి సమాధానం విన్న పోలీసులు.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే బాలుడి తండ్రికి ఫోన్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలకు బండి ఇవ్వకూడదని వార్నింగ్ ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement