వనపర్తి జిల్లా గోపాలపేట ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ 8వ తగతి చదువుతున్న భరత్ అనే విద్యార్థికి మూర్ఛ వచ్చింది. దీంతో హాస్టల్ సిబ్బంది వనపర్తిలోని ఎంసీహెచ్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే అతడు మృతిచెందాడు. అతని స్వస్తలం గోపాలపేట మండలంలోని ఏదుట్ల గ్రామం. దీంతో అతని తల్లదండ్రులకు అధికారులు సమాచారం అందించారు.
ఉదయం హాస్టల్‌లో ఫిట్స్ రావడంతో తోటి విద్యార్థులు వనపర్తి హాస్పిటల్‌కు తరలించగా, భరత్ అప్పటికే మృతిచెందాడని డాక్టర్లు తెలిపారు. 4నెలల క్రితం తండ్రి చనిపోగా, చిన్న వయసులో భరత్ చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భరత్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నాకు దిగారు.