నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని కోర్వ గల్లీలో ఈ రోజు జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణ ఏఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్, కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ తనిఖీలలో ఏలాంటి అనుమతి పత్రాలు లేని 88 ద్విచక్ర వాహనాలు,2 టాటా మ్యాజిక్లు,1కారు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు వాహనదారులు తప్పక పాటించాలని, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపకూడదని కోరారు. వాహనాలకు సంబంధించిన ధృవ పత్రాలు కల్గి ఉండాలనీ, మైనర్లకు వాహనాలను నడపడానికి ఇవ్వకూడదని సూచించారు. సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు ఎలాంటి ఓటీపీ నంబర్లు చెప్పకూడదని మొబైల్ స్క్రీన్ లపై వచ్చే ఎలాంటి ఆన్లైన్ లింకులను తాకావద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ శ్రీనివాస్ ఎస్ఐ లు శ్రీకాంత్,పుర్నేశ్వర్, అమూస్ బెటాలియన్ ఎస్ఐ లు శివ,రమేష్, రవి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.