సంగారెడ్డి జిల్లా భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లాలోని కంకోల్ చెక్‌పోస్టు వద్ద 83.4 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏవోబీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. చిత్తూరు జిల్లాకు చెందిన నిందితుడిని అరెస్టు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. ఈ గంజాయి విలువ రూ.33.50 లక్షలు ఉండొచ్చని పోలీసులు తెలిపారు.
ఇవాళ తెల్లవారుజామున చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఓ కారులో గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. క్షుణ్ణంగా పరిశీలించగా.. సీట్ల కిందిభాగంలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక పెట్టెలో గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
- Advertisement -