Saturday, November 23, 2024

దేశంలోనే తొలిసారిగా సింహాల‌కు క‌రోనా పాజిటివ్

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశంలో మ‌నుషుల‌కు మాత్ర‌మే సోకుతున్న క‌రోనా ఇప్పుడు దాని ప్ర‌భావం జంతువుల‌పై కూడా చూపుతోంది. దేశంలో తొలిసారిగా జంతువుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన కేసులు హైద‌రాబాద్ లో వెలుగు చూశాయి నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లో పని చేస్తున్న వన్యప్రాణి పశువైద్యులు సఫారిలో ఉంచిన సింహాలలో ఆకలి లేకపోవడం, ముక్కు నుంచి రసి కారడం అలాగే, దగ్గు వంటి కొవిడ్ లక్షణాలను గమనించారు. దీంతో వాటి న‌మూనాల‌ను సేక‌రించి ప‌రీక్ష‌ల నిమిత్తం సీసీఎంబీకి పంపారు. సఫారీ ప్రాంతం 40 ఎకరాలు ఉండగా.. ఇందులో పది సంవత్సరాల వయసున్న 12 సింహాలు ఉన్నాయి.వీటిలో నాలుగు ఆడ సింహాలు, నాలుగు మగ సింహాలు మహమ్మారి బారిన ప‌డ్డాయి. దీంతో జూ పార్క్ సిబ్బంది పార్కులో వాటిని విడివిడిగా ఐసోలేష‌న్‌లో ఉంచారు. అక్క‌డే వాటికి చికిత్స అందిస్తున్నారు. కాగా క‌రోనా నేప‌థ్యంలో గ‌త కొన్ని నెల‌లుగా జూ లోకి సంద‌ర్శ‌కుల‌ను అనుమ‌తించ‌డం లేదు. సింహాల‌కు క‌రోనా సోకిన నేప‌థ్యంలో జు పార్కులోని సిబ్బందికి క‌రోనా పరీక్ష‌లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement