Friday, November 22, 2024

ముత్యందార జలపాతం లో చిక్కుకున్న 70 మంది పర్యాటకులు

నూగురువెంకటాపురం జులై 26 (ప్రభ న్యూస్) ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం ముత్యం దార జలపాతం కు వెళ్లిన 70 మంది సందర్శకులు అటవీ ప్రాంతంలో చిక్కుకు పోయారు. మండల పరిధిలోని వాజేడు మండలం లోని బొగత జలపాతాన్ని వర్షాలు కురుస్తున్న సందర్బంగా అటవీశాఖ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. జలాపాతనికి వచ్చిన కొందరు సందర్శకులు అనుమతులు లేని ముత్యందార  జలపాతం వద్దకు వెళ్లారు.ఉదయం వెళ్లిన తరువాత ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు పొంగుతున్నాయి .దాంతో వెళ్లిన సందర్శకులు ముత్యందా రా సమీపంలో చిక్కుకున్నారు.

చిక్కుకున్న వారు 100 కు డైల్ చేసి చే ప్పినట్లు సమాచారం.కాగా ముత్యం దార జలపాతానికి వెళ్లే పర్యాటకులు వెంకటాపురం మండల కేంద్రానికి
కి లోమీటర్ల దూరంలో ఉన్న వీరభద్రారం గ్రామ వద్ద వాహనాలు నిలిపివేసి నడుచుకుంటూ వీరభద్ర గ్రామం నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముత్యం ద్వారా జలపాతానికి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లారు వెళ్లే సమయంలో వాగు ఉధృతి లేకపోవడంతో వాగు దాటుకుంటూ వెళ్లారు అనుకోకుండా కురిసిన భారీ వర్షానికి వాగులు ఉప్పొంగడంతో తిరిగి వచ్చే సమయంలో వాగు దాటలేక అటవీ ప్రాంతంలో చిక్కుకున్నారు ఈ సమాచారాన్ని పర్యాటకులు 100 కు అందించడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు కాగా వీరభద్రారం వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది

భద్రాచలం వెంకటాపురం ప్రధాన రహదారిపై పాత్ర పురం వీరభద్రారం గ్రామ ల మధ్యన ఉన్న కుక్కతోఱే వాగు వద్ద భద్రాచలం వెంకటాపురం ప్రధాన రహదారిపై గోదావరి వరద నీరు చేరుకోవడంతో వెళ్లలేని పరిస్థితి నెలకొన్నయి అయినప్పటికీ అధికారులు సహాయక చర్యలు చేపట్టేందుకు కు సన్నాహాలు చేపట్టారు
 

Advertisement

తాజా వార్తలు

Advertisement