హైదరాబాద్ – రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ కిట్ల కొరత రోజు రోజుకు తీవ్రమ వుతోంది. కరోనా సెకండ్‌వేవ్ ప్రమాదకరస్థితిలో వ్యాపిస్తున్న సమయంలోనూ కరోనా టెస్టులను 70వేలకే పరిమితమ య్యాయి. వాస్తవానికి వైరస్ ఉధృతి రాష్ట్రంలో తీవ్రంగా ఉంది. ఈసమయంలో టెస్టులు ఎక్కువ చేసి పాజిటివ్ కేసులను వేరు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే… కిట్లకు భారీగా కొరత ఏర్పడడంతో టెస్టుల సంఖ్య తగ్గించారు. ఫలితంగా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటలలో 70.961 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6876 మందికి పాజిటివ్ నిర్ధారణైంది.. . తాజా కేసులను కలుపుకుంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4, 63, 761కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకోవడంతో 7432 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3, 81, 365 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా… ఇక కరోనాతో సోమవారం నాడు 59 మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఖ్యను కలుపుకుంటే ఇప్పటి వరకు రాస్‌ట్రంలో 2476 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవు తున్నాయి. ఆదిలాబాద్‌లో 112, భద్రాద్రి కొత్తగూడెం 121, జీహెచ్‌ఎంసీ 1029, జగిత్యాల 211, జనగామ 65, జయశంకర్ భూపాలపల్లి 78, జోగులాంబ గద్వాల 96, కామారెడ్డి 118, కరీంనగర్ 264, ఖమ్మం 235, కొమరంభీం ఆసీఫాబాద్ 84, మహబూబ్‌నగర్ 229, మహబూబాబాద్ 133, మంచిర్యాల 188, మెదక్ 30, మేడ్చల్ మల్కాజిగిరి 502, ములుగు 44, నాగర్‌కర్నూలు 190, నల్గొండ 402,నారాయణపేట 29. నిర్మల్ 58, నిజామాబాద్ 218, పెద్దపల్లి 218, రాజన్నసిరిసిల్ల 107, రంగారెడ్డి 387, సంగారెడ్డి 157, సిద్ధిపేట 258, సూర్యాపేట 372, వికారాబాద్ 171, వనపర్తి 123, వరంగల్ రూరల్ 109, వరంగల్ అర్భన్ 354, యాదాద్రి భువనగిరి 183.
కోవిడ్ వార్డుల్లో సదుపాయాల కొరత… బెడ్లకు కటకట
కోవిడ్ రోగుల తాకిడి పెరిగిపోతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో ముఖ్యంగా హైదరాబాద్ లోని గాంధీ, టిమ్స్, కింగ్‌కోఠి తదితర ఆసుప త్రుల్లో సదుపాయాల కొరత పెరిగిపోతోంది. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో కోవిడ్ బెడ్లకు తీవ్ర కొరత ఏర్పడింది. చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ డిశ్చార్జి అయితేనే, లేకపోతే చనిపోతే మాత్రమే మరో కోవిడ్ రోగికి పడక దొరికే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. బెడ్ దొరక్కపోవడంతో ఆసుప త్రుల ప్రాంగణంలోని చెట్ల కింద రోగులు ఉండాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు పడక ఖాళీ అవుతుందా..? అని వైద్యులను, సిబ్బందిని నిమిషానికోసారి వేడుకుం టున్నారు. ఆక్సిజన్ నిల్వలు పడిపోయిన స్థితిలోనే కోవిడ్ రోగులు ఆసుపత్రులకు వస్తున్నారు. దీంతో వారు కోలుకునేందుకు కనీసం వారం,పది రోజుల సమయం పడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వైద్యం దొరుకుతుందన్న కొండ ంత ఆశతో హైదరాబాద్ గాంధీ, కింగ్ కోఠి, చెస్ట్ ఆసుపత్రులకు వస్తే… ఆక్సిజన్, వెంటిలేటర్, ఐసీయూ బెడ్లు నిండా యన్న సమాధానం వస్తోంది. దీంతో రోజుల తరబడి బెడ్ కోసం రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రుల ప్రాంగణాల్లోనే నీరిక్షించాల్సి వస్తోంది. చివరకు ఒకే ఆక్సిమీటర్‌ను ఐసీయూ, ఆక్సిజన్ వార్డుల్లోని కోవిడ్ పేషెంట్ల కోసం వినియోగించాల్సి వస్తోంది. బీపీ, ఈసీజీ మిషన్లు కూడా పెద్ద సంఖ్యలోచేరుతున్న రోగులకు సరిపడా లేని పరిస్థితి నెలకొంది.
తెలంగాణలో కొత్తగా 6876 కరోనా పాజిటివ్స్ – 59 డెత్స్….
Advertisement
తాజా వార్తలు
Advertisement