Wednesday, November 6, 2024

ప్రభుత్వానికి రెట్టింపు కిక్కు.. నిజామాబాద్ జిల్లా నుంచి ఎక్సైజ్‌కు రూ.68.36 కోట్ల ఆదాయం

నిజామాబాద్ సిటీ, ప్ర‌భ న్యూస్ : ఉమ్మడి జిల్లాల్లో మద్యం దుకాణాల టెండర్ల కోసం జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో దండిగా దరఖాస్తు చేసుకున్నారు. 2021-23 మద్యం టెండర్ల కాలపరిమితి నవంబర్‌లో ముగియనున్నది. ఈ క్రమంలో మూడునెలల ముందుగానే ప్రభుత్వం 2023-25 కాలపరిమితికి ఈ నెల 4 నుంచి దరఖాస్తులను కోరింది. ఇందుకు పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. శుక్రవారం(నిన్న‌టి)తో గడువు ముగుస్తుండ‌గా చివరి రోజు పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తు చేసుకునేందుకు ఎక్సైజ్‌ కార్యాలయాల వద్ద క్యూ క‌ట్టారు.

ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం గడువు ముగియడంతో… రికార్డు స్థాయిలో ఎక్సైజ్ కార్యాలయానీకి దరఖాస్తు దారులు రావడంతో.. కిక్కిరిసి పోయింది. గతంతో పోలిస్తే ఈసారి రెట్టింపు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. శ్రావణం మాసం ప్రారంభం కావడంతో సెంటిమెంటుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మహిళలతో దరఖాస్తులు చేయించారు.

నిజామాబాద్ జిల్లాలోని 102 వైన్స్‌లకు శుక్రవారం ఒకే రోజు 1710 దరఖాస్తులు వచ్చి నట్లు డిప్యూటీ కమిషనర్ దశరథ, ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ మల్లా రెడ్డి తెలిపారు. జిల్లాలో ఈనెల 16 వరకు 545 దరఖాస్తులు రావడంతో రాష్ట్ర జాయింట్‌ కమిషనర్‌ యాషీన్‌ఖురేషీ జిల్లా కార్యాలయంలో ఉండి పరిశీలించారు.

- Advertisement -

జిల్లాలోని ఎక్సైజ్‌ సీఐలు, ఎస్సైలు, సిబ్బందికి రాష్ట్ర జాయింట్‌ కమిషనర్‌ యాషీన్‌ ఖురేషీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం. శుక్రవారంతో ఆఖరు రోజు కావడంతో దరఖాస్తు దారులు ఇబ్బందులు కలుగకుండా రెండు రోజుల నుంచి అదనంగా ఏడు వైన్స్‌లకు ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ మల్లారెడ్డి చెప్పారు.

జిల్లాలో అత్యధికంగా మోపాల్, మాణిక్‌బండార్‌ వైన్స్‌లకు దరఖాస్తులు వచ్చాయని, అతి తక్కువ జాన్కంపేట్‌ వైన్స్‌కు నాలుగు దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వైన్స్‌లకు దరఖా స్తులు చేసుకునేవారు రాత్రి 11 గంటల వరకు క్యూలో నిలబడ్డారు. ఉదయం 10 గంటల నుంచి దరఖాస్తులు అధిక సంఖ్యలో రావడంతో ఇబ్బందులు కలుగకుండా ఎక్సైజ్‌ అధికారులు సిబ్బందితో సలహాలు, సూచనలు చేశారు.

గతంలో(2021లో)…

నవంబర్‌ 2021లో నిజామాబాద్ జిల్లాలో మద్యం దుకాణాల కోసం 1762 దరఖాస్తులు వచ్చాయి.. జిల్లా నుంచి ఎక్సైజ్‌కు రూ.35.24 కోట్ల ఆదాయం వచ్చి సమ కూరింది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాల కోసం గతంలో 984 దరఖాస్తులు వచ్చాయి..

ఈ సారి..2023

ఇప్పుడు 3,418 దరఖాస్తులకు రూ. 2 లక్షల చొప్పున ఎక్సైజ్‌కు రూ.68.36. కోట్లు వచ్చాయి. గతంతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో మద్యం దుకాణాల కోసం నిజామాబాద్ జిల్లాలో దరఖాస్తు చేసుకున్నారు..

శుక్రవారం సెంటిమెంట్తో మహిళలతో దరఖాస్తులు

నిజాంబాద్ జిల్లాలో మద్యం దుకాణాల కోసం శుక్రవారం చివరి రోజు గడువు ఉండ డంతో శ్రావణ శుక్రవారం సెంటి మెంటుతో తమ అదృష్టాన్ని పరీ క్షించుకోవడానికి మహి ళలు దరఖాస్తు చేశారు.

21న లాటరీ ద్వారా మద్యం దుకాణాలు కేటాయింపు

నిజామాబాద్ జిల్లాలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 21న జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో కలెక్టర్‌ సమక్షంలో లాటరీ ద్వారా వైన్స్‌లను కేటాయిస్తారు. దరఖాస్తుదారులు ఎంట్రీ పాస్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement