Wednesday, November 20, 2024

TG | అభివృద్ధి ప‌నుల‌కు..₹679 కోట్లు… సీఎం రేవంత్

  • మిడ్​మానేరు భూ నిర్వాసితులకు ₹236 కోట్లు
  • ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన
  • ఎల్లంపల్లి భూ సేకరణకు ₹5 కోట్ల కేటాయింపు
  • కాళేశ్వరం ప్యాకేజీ 9పనులకు ₹ 11.79కోట్లు
  • పలు పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్​


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ , క‌రీంన‌గ‌ర్ బ్యూరో : వేముల‌వాడ శ్రీ‌రాజ‌రాజేశ్వ‌ర స్వామి ఆల‌యంలో స్వామి, అమ్మ‌వార్ల ద‌ర్శ‌నం అనంత‌రం ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సుమారు రూ.679 కోట్ల ప‌నుల నిర్మాణాల‌ను ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ సేకరణకు రూ.5కోట్లు, కాళేశ్వరం ప్యాకేజీ 9 పనులకు రూ.11 కోట్ల 79 లక్షలు విడుదల చేశారు.

  • రూ.236 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాప‌న
  • రూ.166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
  • వేములవాడ పట్టణంలో నూలు డిపో ప్రారంభం
  • రూ.47 కోట్ల 85 లక్షలతో మూల వాగు నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన
  • రూ.42 కోట్లతో రుద్రంగి మండలంలో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన
  • రూ.28 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభోత్సవం
  • వేములవాడ పట్టణంలో రూ.కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, రూ.4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ప్రారంభోత్సవం
  • రూ.3 కోట్ల 80 లక్షలతో వేములవాడ పట్టణంలో మురుగు కాల్వ పనులకు శంకుస్థాపన
  • వీర్నపల్లిలో రూ.కోటితో పి.హెచ్.సి నిర్మాణం, మేడిపల్లిలో రూ.5 కోట్లతో జూనియర్ కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement