Tuesday, November 26, 2024

Technology: 13 నగరాల్లో 5 జీ సేవలు.. మొదటి విడత విస్తరణకు టెలికం సంస్థలు రెడీ

సెప్టెంబర్‌ నుంచి 5జీ సేవలు అందించేందుకు దేశీయ టెలికం సంస్థలు సిద్ధమయ్యాయి. మొదటి దశలో 13 నగరాలకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు అందనున్నాయి. స్ప్రెక్ట్రమ్‌ కేటాయింపు జరిగిన వెంటనే, సత్వర సేవలకు సిద్ధమవ్వాలని టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ కోరినసంగతి తెలిసిందే. తొలి దశలో 5 జీ సేవలు అందుకోనున్న నగరాల జాబితాలో అహ్మదాబాద్‌, బెంగళూరు, చండీగఢ్‌, చెన్నై, ఢిల్లి, గాంధీనగర్‌, గురుగ్రామ్‌, హైదరాబాద్‌, జామ్‌నగర్‌, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణ ఉన్నాయని టెలికం విభాగం వెల్లడించింది. స్పెక్ట్రమ్‌ బిడ్ల ద్వారా టెలికం సంస్థల నుంచి రూ. 17,876 కోట్ల రూపాయలు కేంద్రానికి సమకూరాయి. రిలయన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, అదానీ డాటా నెట్‌వర్క్‌, వొడాఫోన్‌ ఐడియా స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ సేవల కంటే 5 జీ సేవలు 100 రెట్లు వేగవంతమైనవి. బఫరింగ్‌ లేకుండా సినిమాలు చూడటానికి, కంటెంట్‌ను త్వరగా డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది.
ఈనెలాఖరులో 5జీ సేవలు ప్రారంభిస్తామని భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. 2024 నాటికి దేశంలోని అన్ని పట్టణాలు , ముఖ్యమైన గ్రామీణ ప్రాంతాలను కవర్‌ చేస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా 5000 పట్టణాల్లో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలకు ప్రణాళికలు అమలు దశలో ఉన్నాయని పేర్కొంది. వొడాఫోన్‌ ఐడియా కూడా కొత్తతరం ఇంటర్నెట్‌ సేవలకు విస్తృత ఏర్పాట్లు చేసుకుంటోంది. ఢిల్లిd-ఎన్‌సీఆర్‌లో మెరుగైన కనెక్టివిటీ కలిగివున్నామని తెలిపింది. 5జీ స్ప్రెక్ట్రమ్‌ వేలంలో రిలయన్స్‌కు చెందిన జియో అతిపెద్ద వాటా దారుగా ఉంది. హైస్పీడ్‌ నెట్‌వర్‌ ్క అందించడానికి ఇది సుమారు 87,400 కోట్లు విలువైన స్ప్రెక్ట్రమ్‌ను సొంతం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement