రైతు బీమా తరహాలోనే రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూడా రూ.5 లక్షల బీమా పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ నూతన కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు చెప్పారు.
బతుకమ్మ చీరల తయారీని చేనేత కార్మికులకు అప్పగించామని నిరంతరం ఉపాధి లభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. నూలు, రసాయనాల మీద 50 శాతం సబ్సిడీ సదుపాయాన్ని కూడా కల్పించామని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..