Tuesday, November 19, 2024

5K Run – ఓటు మన హక్కు….. ఓటేయ్యడం మరవద్దు – కలెక్టర్ డాక్టర్ బి గోపి

కరీంనగర్ – ఎన్నికలలో ఓటు వేయటం,ఎన్నికలలో పాల్గొనే అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించే నిమిత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో 5 కె రన్ నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బిఆర్ అంబేద్కర్ స్టేడియం వద్ద ” ఐ ఓట్ ఫర్ ష్యుర్” అన్న అంశం పై ఏర్పాటు చేసిన 5 కె రన్ ను జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ 5 కే రన్ ద్వారా ప్రజలు, ముఖ్యంగా ఓటర్లు ఎన్నికలలో ఓటు ఎలా వినియోగించుకోవాలో, అదే విధంగా ఏ విధంగా ఎన్నికలలో పాల్గొనాలనే విషయంపై విస్తృతస్థాయిలో తెలియజేయడం జరుగుతుందని తెలిపారు . ఓటు మన హక్కు అని ఓటెయ్యడం మరువద్దని అన్నారు.18 సంవత్సరాల నుండి నిండిన యువత తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెలిపారు. తేది 21.8.2023 రోజున డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రచురించడం జరుగుతుందని పేర్లు పరిశీలించుకోవాలని, పేర్లు తప్పిపోయిన మళ్లీ నమోదు చేసుకోవడానికి నెల సమయం ఉందని తప్పకుండా అర్హులైన వారందరూ తమ ఓటు హక్కును నమో చేసుకోవాలన్నారు. గత ఎన్నికలలో ఓటింగ్ శాతం తక్కువ ఉన్న దృష్ట్యా ఈసారి ఓటు శాతం పెరిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో సంచార వాహనాల ద్వారా ప్రత్యక్షంగా ఈవీఎంలను ఉపయోగించడం ద్వారా ఓటు వేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

5 కె రన్ కు పెద్ద ఎత్తున తరలివచ్చిన యువత ,విద్యార్థులు జిల్లా అధికారులు సిబ్బంది అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 5 కే రన్ అంబేద్కర్ స్టేడియం నుండి భగత్ సింగ్ విగ్రహం, కలెక్టరేట్ మీదుగా ప్లకార్డులను ధరించి “ఐ ఓట్ ఫర్ స్యూర్” అనే నినాదాలతో నేను కచ్చితంగా ఓటు వేస్తానని తెలియజేస్తూ జ్యోతిబాపూలే గ్రౌండ్ వరకు కొనసాగింది . జ్యోతిబాపూలే గ్రౌండ్ వద్ద జిల్లా కలెక్టర్ సీనియర్ సిటిజన్స్ కు సత్కరించారు.
5 కె రన్ లో వేలాదిమంది క్రీడా పాఠశాల విద్యార్థులు ,క్రీడాకారులు, డిఫెన్స్ ,ఆర్మీ , లక్ష్యం అకాడమీ విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్స భ్యులు తదితరులు పాల్గొన్నారు.

. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డిఓ మహేశ్వర్, డీసీపీ, ఏసీపీ ప్రతాప్,డిఆర్డిఓ శ్రీలత, డిపిఓ వీర బుచ్చయ్య, పిడి మెప్మా రవీందర్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరావు,డిపిఆర్ఓ కలీం, డిఈఐపి కొండయ్య, ఎన్ వై కె వెంకట రాంబాబు, పోలీస్, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement