Friday, November 22, 2024

రేషన్‌ షాపులో 4జీ సేవలు.. సాంకేతిక సమస్యలకు చెక్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సెల్‌ (ఈ పాస్‌) ద్వారా బయోమెట్రిక్‌ పద్దతిలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుదారులకు సరుకులు అందజేస్తుంది. ఈ పద్దతిలో డీలర్లు సెల్‌ సిగ్నల్స్‌ అందకపోవడంతో, తంబ్‌, ఐరీస్‌ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా కార్డుదారులు ఒకటికీ రెండు సార్లు రేషన్‌ షాపులకు రావాల్సి వస్తుంది. దుకాణాలు కాస్త దూరంలో ఉంటే రవాణా చార్జీలు వృథా అవుతున్నాయి. దుకాణా ల్లో 4జీ సేవలు అందుబాటులోకి వస్తే తంబ్‌, ఐరీస్‌ వంటి సాంకేతిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బ్లూటూత్‌, వై ఫైతో ఇంటర్నెట్‌ సజావుగా అందుతుంది. దీంతో లబ్దిదారులకు సత్వరం సరుకులు అందే అవకాశం ఉంటుంది. వచ్చే నుంచి నూతన మిషన్లతో డీలర్లు సరుకులు పంపిణీ చేయనున్నారు.

రేషన్‌ పంపిణీలో బయోమెట్రిక్‌ మిషన్‌కు వై పై ద్వారా బ్లూటూత్‌ కనెక్షన్‌ ఇవ్వాల్సి ఉంది. మారుమూల గ్రామా ల్లో సెల్‌ సిగ్నల్స్‌ సరిగా లేకపోవడంతో తంబ్‌, ఐరిస్‌ తీసుకునే సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. మరి కొన్ని సందర్భాల్లో ఐరిస్‌ మిషన్లు పనిచేయడం లేదు. ఈ ఇబ్బందులన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం రేషన్‌ దుకాణాల్లో 4జీ సదుపాయం ఉన్న ఈ పాస్‌ మిషన్లను అందుబాటులోకి తీసుకురానుంది. నూతన ఈ-పాస్‌ మిషన్ల వినియోగంపై ఆయా మండలాలకు చెందిన డీలర్లకు శిక్షణ ఇచ్చి నూతన ఈ-పాస్‌ మిషన్లు అందజేస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement