నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తెలంగాణ శాసనసభ ఎన్నికల బరిలో 2290 మంది అభ్యర్ధులు పోటీలో మిగిలారు. బుధవారం రాత్రి వరకు 608 మంది అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకు న్నట్లు సమాచారం. అయితే రాత్రి వరకు అధికారిక జాబితా ఖరారు కాలేదు. రెబల్స్‌ను సంతృప్తపర్చడంలో పార్టీలన్నీ సఫలీకృతమయ్యాయి. బుజ్జగింపులతో విజయవంత మ య్యాయి. అసంతృప్తులు, రెబల్స్ భారీ నుంచి ఉపశమనంతో ఊపిరిపీల్చుకున్నాయి.
ఇంత చేసినప్పటికీ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో 114 మంది అభ్యర్ధులకు 70మంది అభ్యర్ధులే కడపటి వరకు తమ నామినేషన్లను ఉపసంహ రించుకున్నారు. దీంతో ఇంకా 44మంది ఎన్నికల పోరులో నిల్చారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిలు పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో 58 నామి నేషన్లలో 19మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసం హరించుకున్నారు. దీంతో బరిలో ఇంకా 39మంది అభ్యర్ధు లు నిల్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 15 అసెంబ్లిd సెగ్మెం ట్లలో 20 మంది అభ్యర్ధులు నామినేషన్లను ఉపసంహరిం చుకోగా, 312 మంది బరిలో మిగిలారు. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్ధుల జాబితాను ఈసీ ఖరారు చేసింది. స్వతం త్రులకు గుర్తుల కేటాయింపు పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. నేటినుంచి రాష్ట్రంలో అసలు సిసలు ఎన్నికల ప్రచారం మొదలుకానుంది. ఎన్నికలకు ఇంకా 14 రోజులే మిగిలి ఉండటం, ప్రచారానికి 12 రోజులే ఉండటంతో పార్టీలన్నీ తమ ప్రచార వేగం పెంచనున్నాయి. గుర్తుల కేటాయింపు అనంతరం ఇండిపెండెంట్లు కూడా తమ ప్రచారాన్ని పరుగులు పెట్టించనున్నారు.
గండం గడిచింది… ఇక ప్రచారమే తరువాయి…
ఒకవైపు నామినేషన్లు, ఆ తర్వాత విత్‌డ్రా అంశం కూడా ముగియడంతో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగు తోంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతి ష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నాయి. ఈ ఎన్నికలు గత ఎన్నికలకంటే భిన్నమని భావిస్తూ ముందుకు వెళుతు న్నాయి. ఈ దఫా హంగ్ అంటూ పలు సర్వేలు తేల్చడం, అత్యధిక నియోజకవర్గాల్లో గెలుపోటముల మధ్య చాలా స్వల్ప తేడా ఉంటు-ందనే అభిప్రాయాల నేపథ్యంలో పార్టీలు ముందుచూపుతో వ్యవహరిస్తున్నాయి. ఒక్క ఓటును కూడా ముఖ్యమైనదేననే కోణంలో ప్రచారం చేస్తున్నాయి. ఇటువంటి సమయంలో ప్రత్యర్థుల ఓట్ల చీలికతో పాటు- తమ ఓట్లను కాపాడుకోవడం అన్ని పార్టీల అభ్యర్థులకు కీలకంగా మారింది. ఈ క్రమంలోనే టిక్కెట్ రాలేదన్న కోపం, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తితో నామినేషన్ వేసిన సొంత పార్టీ రెబల్ అభ్యర్థులతో నామినేషన్లను ఉపసంహ రింపచేసేందుకు ప్రధాన పార్టీలన్నీ తమ శక్తియుక్తులను ప్రదర్శించి సక్సెస్ అయ్యాయి.