Saturday, November 23, 2024

Heat waves: వడదెబ్బ తగిలి నాలుగేళ్ల చిన్నారి మృతి

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి నిహారిక వడదెబ్బతో మృతి చెందింది. మూడు రోజుల క్రితం తల్లిదండ్రులతో పొలం వద్దకు వెళ్లిన బాలిక… వడదెబ్బ తగిలి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో బాలిక తల్లిదండ్రులు రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా బాలిక నిహారిక మృతి చెందింది. దీంతో బాలిక కుటుంబంలో విషాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement