ధూప దీప నైవేద్య పథకాన్ని మరో 350 ఆలయాలకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఇవ్వాల (బుధవారం) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద అమలవుతున్న ఆలయాల సంఖ్య మొత్తం 6,271 పెరిగింది. అట్లనే ఈ నెల నుంచి డీడీఎన్ ఆలయాలకు ప్రతి నెలా రూ.10వేల చొప్పున చెల్లించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం ధూపదీప నైవేద్యం పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉన్న సుమారు 11వేలకుపైగా ఆలయాలను ఈ పథకంలో చేర్చాలనే ప్రతిపాదన ఉండగా.. దశలవారీగా పథకాన్ని విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవ్వాల మరో 350 ఆలయాలను కొత్తగా అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.
అంతేకాకుండా.. 3,500 ఆలయాల్లోని అర్చకులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీంతో 9,771 ఆలయాలకు ప్రభుత్వ సహకారం ద్వారా ధూప దీప నైవేద్య కార్యక్రమాలు అమలులో ఉన్నాయి. మరో 250 ఆలయాలకు ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు దేవాదాయశాఖ ప్రతిపాదనలు పంపింది. కాగా, ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే మొత్తం ఈ సంఖ్య 11వేలు దాటనున్నది.