హైదరాబాద్లో మహేష్ కో- ఆపరేటివ్ బ్యాంకులో ఇవాళ ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.300 కోట్ల నిధులు గోల్మాల్పై గతంలోనే పోలీస్ కేసు నమోదైంది. హైదరాబాద్ సిటీ పోలీస్ కేసు ఆధారంగా నగరంలోని 6ప్రాంతాల్లో సోదాలు జరిపారు.
అనర్హులకు రుణాలు ఇచ్చారన్న ఆరోపణలపై మహేష్ బ్యాంక్ ఛైర్మన్ రమేష్ కుమార్, ఎండీ పురుషోత్తం దాస్, సీఈవో, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేసిన ఈడీ అధికారులు హవాలా ద్వారా డబ్బులు మళ్లించినట్లుగా గుర్తించారు. దీంతో బ్యాంక్ ఎండీ, సీఈవో, డైరెక్టర్లతో సహా పలువురిపై కేసు నమోదు చేశారు.
- Advertisement -