తెలంగాణలో 1.68 లక్షల మందికే పోస్టల్ బ్యాలెట్స్ కు అనుమతి ఇవ్వడం పట్ల టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.. ఎన్నికల విధుల్లో 3.03 లక్షల మంది ఉద్యోగులు ఉండగా కేవలం 1.68 మందికే బ్యాలెట్‌కు అనుమతి ఇవ్వడం ఏమిటని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.ఈ మేరకు రేవంత్ రెడ్డి ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో తలెత్తిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జోక్యం చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్లో ఓటు వేసే అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అవసరమైతే పోస్టల్ బ్యాలెట్ వేసే తేదిలో మార్పు చేసి ఎన్నికల విధులలో ఉన్న ప్రతి ఒక్కరరికి ఓటు వేసే అర్హత కల్పించాలని కోరారు.