Friday, November 22, 2024

పేకాట ఆడుతూ అడ్డంగా బుక్ అయిన టీచర్లు

విద్య బుద్ధులు చెప్పి, బావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ సన్మార్గంలో పెట్టాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయులే పేకాట ఆడుతూ టాస్క్ ఫోర్స్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆదర్శవంతులుగా తయారు చేయాల్సిన సర్కార్ పంతుల్లే , తప్పటడుగులేస్తూ రక్షకభటులకు పట్టుబడి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తీసుకురావడం విమర్శలకు తావిస్తోంది. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

గత కొంత కాలంగా నెక్కొండ మండల కేంద్రంలోని ఓ ఇంటినే పేకాట అడ్డగా మార్చుకొని రెగ్యులర్ గా పేకాట ఆడుతున్నట్లు వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంను అందుకున్నారు. రెక్కీ వేసి, పేకాట ఆడుతున్నట్లుగా నిర్ధారించుకొన్న తర్వాత ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో 7 గురు పేకాటరాయుళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ ఎదుగురిలో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నట్టు గుర్తించారు. వారి నుండి 6 మొబైల్ ఫోన్లు, ప్లే కార్డ్స్ తో పాటు  59 వేల 330 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 70 ఏళ్ళ వయస్సులో వైద్యం చేసే బల్నే. ఉపేందర్ ఇంటినే పేకాట అడ్డ గా మార్చాడు. టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ సి హెచ్ శ్రీనివాస్ జీ నేతృత్వంలో దాడి చేసి, ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు.  బల్నే.ఉపేందర్ (70), తాళ్లూరి. నరసింహ స్వామి (48), కంది.సుబ్బా రెడ్డి (60), తాళ్లూరి వెంకటేశ్వర్లు (76) లతో పాటు ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు బానోత్ భిక్షపతి(47),బండి.భాస్కర్ రెడ్డి (52), రాపోలు యాకయ్య (51) లను అరెస్ట్ చేసి, తదుపరి చర్యల కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. విద్య బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు పేకాట ఆడుతూ దొరకడం లోకల్ లో చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: అనంతలో ఆసక్తికర సీన్.. పరిటాలను ఆలింగనం చేసుకున్న జేసీ

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement