Tuesday, November 26, 2024

Exclusive | హెల్త్​కి​ ఇంపార్టెన్స్​.. 29 ప్రభుత్వ మెడికల్​ కాలేజీలు ఏర్పాటు: మంత్రి హరీశ్​

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎనిమిదేళ్లలో 29 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. వీటిలో ప్రస్తుతం 21 కళాశాలలు పనిచేస్తుండగా, ఎనిమిది కళాశాలలు ఎస్టాబ్లిష్​ మెంట్​ అవుతున్నాయని మంత్రి అన్నారు. ఇవ్వాల (శనివారం) అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై వివరణ ఇచ్చారు. జులైలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం 100 మందితో 8 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేసిందన్నారు. తెలంగాణలో వైద్య ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించారు.

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రభుత్వం సంవత్సరానికి రూ.10,000 రుసుము వసూలు చేస్తుందని, ఒక్కొక్క వైద్య విద్యార్థి ఖర్చుకు దాదాపు రూ.30 లక్షలు ఖర్చు చేస్తుందన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఈ వివరణ ఇచ్చారు. పీజీ డాక్టర్‌కు దాదాపు రూ.45 లక్షలు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్‌కు రూ.75 లక్షలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. 100 సీట్లు, 430 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు దాదాపు రూ.300 కోట్లు, 150 సీట్లు, 600 పడకల ఆస్పత్రికి రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement