పట్టు చీరల విషయానికి వస్తే సిరిసిల్ల నేతన్నలు నేసే పట్టు చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వస్త్రాలను నేసే ఇక్కడి నేతన్నలు నిత్యం ఏదో ఒక కొత్త తరహా పద్దతిని అవలంబిస్తూ ఉంటారు. తమ వినూత్న రీతులతోనే వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్ సరికొత్త ఆలోచన చేశాడు. 27 సుగంధ ద్రవ్యాలతో ఓ పట్టు చీరను నేశాడు. ఇతరత్రా పట్టుచీరల మాదిరే ఈ పట్టుచీరకు వినియోగించిన దారాలను ఆయన సుగంధ ద్రవ్యాలతో కూడిన ద్రావణంలో ముంచి మరీ చీరను నేశాడు. వెరసి ఈ చీరను అలా విప్పగానే… సువానసలు విరజిమ్ముతున్నాయి. ఈ చీరను మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు శనివారం ఆవిష్కరించారు. నూతన ఆవిష్కరణలతో సాగుతున్న విజయ్‌ను మంత్రులు అభినందించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement