అభివృద్ధి పరంపరంలో సమస్యలుత్పనం అవుతూనే ఉంటాయి
ఒక్కోక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదాం
5 ఏళ్ల క్రితం బాచుపల్లి వేరు ఇప్పటి బాచుపల్లి వేరు
ఇప్పటికే ఎంతో చేశాం.. మరింత చేస్తాం
25వ రోజుకి చేరిన ప్రగతి యాత్ర
కుత్బుల్లాపూర్, మార్చి 18 (ప్రభ న్యూస్): అభివృద్ధే నా నినాదం.. సమస్యలు లేని బస్తీలు, కాలనీలే నా లక్ష్యమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి. వివేకానంద గౌడ్ స్పష్టంచేశారు. ప్రగతి యాత్రలో భాగంగా 25వ రోజు శనివారం నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి ఎస్‌వీఎస్ ఆభరణ కాలనీలో ఆయన పర్యటించారు. తొలుత కాలనీ అంతటా పాదయాత్ర నిర్వహించి గణష్ మండపం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కార్పొరేటర్ బాలాజీ నాయక్ కాలనీలోని సమస్యలను ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఇంచార్జి కమిషనర్ రామకృష్ణారావుకు సమస్యలను విన్నవించారు. అనంతరం కాలనీ అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి ఛాయాలక్ష్మి , ప్రతిమలు కాలనీలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.
నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో మహిళా మణులను అధ్యక్ష, కార్యదర్శులుగా చూడలేదు
ఎస్‌వీఎస్ ఆభరణ కాలనీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మాట్లాడుతూ తాను 20 ఏళ్లుగా రాజకీయ జీవితంలో కొనసాగుతున్నానని నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓ కాలనీకి అధ్యక్ష, కార్యదర్శులు మహిళలు ఉండటం చూడలేదన్నారు. కాలనీ అధ్యక్ష, కార్యదర్శులుగా ఛాయాలక్ష్మీ, ప్రతిమల కృషి గొప్పదన్నారు. ఓ వైపు ఇళ్లు చక్కపెట్టుకుంటూనే కాలనీని చక్కదిద్దుతున్న తీరు ప్రశంసించదగిందన్నారు. కాలనీలోని ప్రతి ఒక్కరు అసోసియేషన్ సభ్యులేనని కాలనీ అంతా ఐకమత్యంగా ఉండాలని సూచించారు. మానవజాతికి ఐక్యత ఎంతో ప్రధానమని ఐక్యత ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని ఎస్‌వీఎస్ ఆభరణ కాలనీని సభ్యులనుద్దేశించి ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ ప్రసంగించారు. గతి లేని సంసారం చేయొచ్చు కాని శృతి లేని సంసారం చేయలేము అనే గొడ్డు సామెతను ప్రతి ఒక్కరు గుర్తుంచుకుని అభివృద్ధి కోసం అందరూ ఐక్యమత్యతతో ఉండాలని కోరారు.
రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్య పూర్తిగా తీర్చేస్తా..
ఎన్నికలు డిసెంబర్ నెలలో జరుగనున్నందున ఆ లోపే ఎస్‌వీఎస్ ఆభరణలో అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కేపి. వివేకానంద్ కాలనీ వాసులకు హామి నిచ్చారు. ఇప్పటికే కాలనీలో ఎస్‌ఎన్‌డీపీ కింద బాక్స్ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని వాటర్ పైప్‌లైన్లు పూర్తిచేసి కాలనీ అంతటా సీసీ రోడ్లు నిర్మింపచేస్తామన్నారు. ఇక కాలనీకి శాశ్వతంగా తాగునీటిని పరిష్కరిస్తామని అందుకోసం గోదావరి జలాలను కాలనీకి తీసుకొచ్చి ప్రజల దాహార్తిని తీర్చుతామన్నారు. పొట్టి శ్రీరాములు యూనివర్సీటీలో 7.5కెఎల్ లీటర్ల సామర్థ్యంతో హెచ్‌ఎండబ్ల్యూఎస్ నీటి ట్యాంకును నిర్మిస్తుందని పొట్టి శ్రీరాములు యూనివర్సీటీ ఎత్తులో ఉన్న కారణంగా ప్రతి కాలనీకి సరిపోను తాగునీరు వస్తుందని టెన్షన్ పదవద్దని సూచించారు.
గోపాల్ కాకను నమ్మకండి.. మేయర్ గొప్ప నాయకురాలు
ఎస్‌వీఎస్ ఆభరణలో జరిగిన కార్యక్రమంలో చమత్కారం చోటుచేసుకుంది. స్టేజీ పైన ఉన్న మేయర్ భర్త గోపాల్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గోపాల్ కాకను నమ్మొద్దని సమస్యలుంటే మేయర్ నీలా గోపాల్‌రెడ్డిని కలిసి విన్నవించాలని తెలిపారు. మేయర్ నీలా గోపాల్‌రెడ్డి స్థానింగా అందుబాటులో ఉంటారని షీ ఈస్ ఏ జెంటిల్ లేడీ అని అభి వర్ణించారు. కమిట్‌మెంట్ ఉన్న నాయకురాలని కార్పొరేషన్ అభివృద్ధి కోసం ఎంతో చేస్తున్నారని జాతీయ స్థాయిలో కార్పొరేషన్‌కు ఆవార్డు రావడంలో ఆమె పాత్ర ఎంతో దాగి ఉందని గుర్తుకుచేశారు. అటు ఇంట్లో చేసుకుంటూనే కార్పొరేషన్‌ను పాలిస్తూనే బీఆర్‌ఎస్ పార్టీ అభివృద్ధికి సైతం కృషిచేస్తున్నారని తెలిపారు.
హిల్ కౌంటీ రోడ్డు పై కౌన్సిల్‌లో తీర్మానం చేయండి
గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సరళీకృతమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషిచేస్తుందని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్నారు. మంత్రి కేటీఆర్ గొప్ప విజన్‌తో గ్రేటర్‌లో ఇప్పటికే ఎన్నో లింక్ రోడ్లను పూర్తిచేయించారని తెలిపారు. వెంటనే నిజాంపేట్ కార్పొరేషన్‌లో హిల్ కౌంటీ విషయమై వెంటనే తీర్మాణం చేయాలని డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్ యాదవ్‌కు సూచించారు. స్వయంగా హెచ్‌ఎండీఏ కమిషనర్‌తో భేటీ అయ్యి హిల్ కౌంటీ రోడ్డు పునరుద్దరించేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే వివేక్ హామినిచ్చారు.
అనంతరం కాకతీయనగర్ కాలనీవాసులతో ముచ్చటించిన ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ సమస్యలను పరిష్కరిస్తానని హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ- మేయర్ ధనరాజ్ యాదవ్, ప్లnోర్ లీడర్ మరియు కార్పొరేటర్ ఆగం పాండు, కార్పొరేటర్లు విజయలక్ష్మీ, చిట్ల దివాకర్, గాజుల సుజాత, ఆగం రాజు, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీమ్ గారు, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ గారు, సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్, బీఆర్‌ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివ రెడ్డి , స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి , స్ధానిక డివిజన్ మహిళా అధ్యక్షురాలు సంధ్య రాణి , ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, వాటర్ వర్క్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్ సౌత్ జోన్ ఛాంపియన్ షిప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఖేలో ఇండియా స్కీమ్ లో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ- ఆఫ్ ఇండియా సహకారంతో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దుండిగల్ ఎంఎల్‌ఆర్‌ఐటీ- వద్ద 18, 19వ తేదీలలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్ సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్ ను శనివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎంఎల్‌ఆర్‌ఐటీ- అధినేత డాక్టర్ మర్రి లక్ష్మణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. 16- 18 ఏళ్లకు పైగా వయస్సు గల యువతులు ఈ పోటీ-ల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ క్రీడాకారులను అభినందించారు. సైక్లింగ్ క్రీడలలో యువతులు, మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో చేపట్టిన ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్ ను తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సౌత్ జోన్ డా.మాక్స్‌వెల్ -టె-వర్, అడిషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.కె.పాష మరియు కౌన్సిలర్ జక్కుల కృష్ణయాదవ్, దుండిగల్ రైడర్స్ భీమ్ సింగ్, ప్రవీణ్ గడిల, జగన్ నాయక్, హాజి, పోచయ్య తదితరులు పాల్గొన్నారు
ఉపనయం- పెళ్లిలో పాల్గొని ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేకానంద గౌడ్
నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి ప్రగతినగర్ శ్రీ కృష్ణగార్డెన్స్‌లో బీఆర్‌ఎస్ నాయకులు అచంట రాము కుమారుడి ఉపనయనం కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపి. వివేకానంద గౌడ్ పాల్గొని ఆశీర్వదించారు. అనంతరం హెచ్‌ఎండబ్ల్యూఎస్ ఏఈ సాయిరామ్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యేతో పాటు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, లీడర్లు పాల్గొన్నారు.