కవులు, కళాకారులను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యతన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల కళాకారులను మరింత ప్రోత్సహిస్తామని చెప్పారు. అవార్డులతో మట్టిలో మాణిక్యాల ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. చప్పట్లు, దుప్పట్లు కాదు కళాకారులకు నగదు సాయం కూడా అందిస్తామని తెలిపారు సీఎం. ఒక్కో పద్మశ్రీ అవార్డు గ్రహీతకు రూ.25 లక్షల ఆర్థిక సాయంతో పాటుపద్మశ్రీ కళాకారులకు నెలకు రూ. 25 వేల పెన్షన్ అందిస్తామని ప్రకటించారు.
సంప్రదాయలు, భాషను గౌరవించుకునే విషయంలో మనమంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన ఒక కారక్రమంలో పద్మ పురస్కార గ్రహీతలను ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, వెంకయ్య నాయుడికి సన్మానం అంటే మనల్ని మనం సన్మానించుకోవడమేనని చెప్పారు. ఢిల్లీ వెళ్లే తెలుగు రాజకీయ నేతలకు వెంకయ్య నాయుడు పెద్ద దిక్కుఅని చెప్పారు. ఆయనకు రాష్ట్రపతి అయ్యేు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. చిరంజీవి కమిట్ మెంట్ ఉన్న నటుడని చెప్పారు. పున్నమినాగులో ఏ స్థాయిలో నటించారో.. సైరాలోనూ అదే స్థాయిలో నటించారని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిరంజీవి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. గొప్ప వ్యక్తుల పోత్సాహంతో ప్రజాపాలన కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.