Thursday, September 5, 2024

24th Anniversary – బసవతారకం ఆస్పత్రి సేవ‌ల‌కు రేవంత్ ప్ర‌శంస‌లు…

హైద‌రాబాద్ లోని బసవతారకం ఆస్పత్రి లక్షల మందికి సేవలు అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి 24 వ వార్షికోత్సవం కార్యక్రమంలో ఆయ‌న ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బసవతారకం కాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు అలాగే డా.నోరి దత్తాత్రేయుడు హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ, నిస్వార్థంగా పేదలకు సేవలు అందించేందుకు ఈ ఆస్పత్రిని నిర్మించారని, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీ పడే అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. ఆయన 18 గంటలు పనిచేసి.. నేను 12 గంటలు పనిచేస్తే సరిపోదన్నారు. తెలంగాణలోని రాష్ట్ర మంత్రులు, అధికారులు సైతం 18 గంటలు పనిచేయాల్సిందేనని వెల్లడించారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలని, ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు. అదే విధంగా హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

హిందూపూర్ ఎంఎల్ఏ, బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ ఛైర్మెన్ బాలకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అందరికి ఆదర్శమ‌ని, .ఆయన ఈ వేడుకకు రావడం ఎంతో ఆనందంగా వుందిని అన్నారు. .స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎంతో దూర దృష్టి కలిగిన వ్యక్తి.. మంచి ఆలోచన తో ఈ హాస్పిటల్ నిర్మించారు.ఆనాడు బండలతో నిండి వున్న ఈ స్థలంలో బసవతారకం ఆస్పత్రి కట్టారు. ఇప్పటికి మంచి సేవలు అందుతున్నాయి.. భారత మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారి వాజ్ పేయి గారు అప్పట్లోనే ఈ హాస్పిటల్ కోసం 6 కోట్లు మంజూరు చేసి హాస్పిటల్ బ‌లోపేతానికి దోహదపడ్డారు.. ఇటువంటి గొప్ప హాస్పిటల్ కి ఛైర్మన్ గా పని చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.ఆంధ్ర రాష్ట్రం ఎమ్మెల్యే గా హిందూపురం ప్రభుత్వ హాస్పిటల్ ని తీర్చి దిద్ది కార్పోరేట్ తరహా వైద్యం అందిస్తున్నాం..అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా త్వరలో బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ప్రారంభించనున్నాం..ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో గతంలోనే చంద్రబాబు గారు స్థలం కేటాయించారు..అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు బాలయ్య తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement