- 13మంది ఆస్పత్రిపాలు
- ప్రాణాపయం లేదన్న వైద్యులు
ఆంధ్రప్రభ స్మార్ట్, కరీంనగర్ : కరీంనగర్ పట్టణం శర్మానగర్ లోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 23 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 13మంది ఆస్పత్రిపాలయ్యారు. ఈ ఘటన జరిగిన పాఠశాలను అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయి పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. పాఠశాలను పరిశుభ్రతగా ఉంచాలని ఆదేశించారు.
13మంది ఆస్పత్రిపాలు…
గురుకుల పాఠశాలలో సోమవారం రాత్రి క్యాబేజీ కూరతో భోజనం చేశారు. అర్ధరాత్రి వేళ విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో ఆందోళన చెందిన సిబ్బంది ఫుడ్‌పాయిజన్ జరిగి ఉంటుందని అంచనా వేసి బాలికలను ఆస్పత్రిలో చేర్పించారు. పది మంది విద్యార్థులకు మాత్రలు ఇచ్చి పంపించేశారు. మిగిలిన 13మందికి కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవులు అందిస్తున్నారు. ఎవరికి ప్రాణాపాయ పరిస్థితి లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి చెప్పడంతో పాఠశాల సిబ్బంది, బాలికల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.