Tuesday, November 19, 2024

పాఠశాల విద్యాశాఖలో 22వేల ఖాళీలు… రెండు రోజుల్లో నివేదిక..

ప్ర‌భ‌న్యూస్ : రాష్ట్రంలోని పాఠశాల విద్యశాఖలోని ఉద్యోగుల వివరాలను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో క్యాడర్‌ స్ట్రెంత్‌ లెక్కలను అధికారులు ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్యాడర్‌ స్ట్రెంత్‌ వివరాలను రెండు, మూడు రోజుల్లో అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిసింది. పాఠశాల విద్యశాఖలో బోధన, బోధనేతర సిబ్బంది కలిపి మొత్తం 1.31లక్షల మంజూరు పోస్టులున్నట్టు అధికారులు తేల్చారు. వీటిలో అటెండర్‌ స్థాయి నుంచి పాఠశాల విద్య డైరెక్టర్‌ పోస్టు వరకు ఉన్నాయి. ఈ 1.31 లక్షల పోస్టుల్లో 18 వేల వరకు టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

అలాగే మరో 11 వేల బోధ నేతర సిబ్బందిలో దాదాపు 8 వేల మంది పని చేస్తుండగా, మరో 3 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోం ది. గతంలో ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌, టైపిస్ట్‌ వంటి పోస్టులను ఇప్పుడు కంప్యూటర్‌ ఆపరేటర్‌ లేదా డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా మార్చనున్నారు. ఇలా అవసరం ఉన్న క్యాడర్లను, పోస్టులను మార్చడం, అవసరం లేని వాటిని రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారు.క్యాడర్‌ స్ట్రెంత్‌కు సంబంధించిన వివరాలను అధికారులు అంతా సిద్ధం చేసి ఉంచారు. రెండు మూడు రోజుల్లో ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement