Monday, November 25, 2024

రాజ‌గోపాల్ రెడ్డికి 2+2 భద్రత ఏర్పాటు చేయాలి.. హైకోర్టు

బీజేపీ నేత‌, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త‌నకు ప్రాణహాని ఉందని.. భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై విచారించిన ధర్మాసనం రాజగోపాల్ రెడ్డికి భద్రత కల్పించాలని ఆదేశించింది. రెండు వారాల్లో 2+2 భద్రత ఏర్పాటు చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. డీజీపీకి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement