Wednesday, December 18, 2024

TG | 21 కిలోల గంజాయి స్వాధీనం.. ఆరుగురు అరెస్ట్

హైదరాబాద్ ఆంధ్రప్రభ : నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ మహానగరం సంసిద్దమవుతుండగా యువకుల, వ్యాపార వర్గాల, టెక్కిల ఉత్సాహాన్ని, జోరును, హుషారును అనుకూలంగా మార్చుకుని, మహా నగరానికి పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు, గంజాయిని దిగుమతి చేసుకుని, పోలీస్ ఎక్సైజ్ శాఖల దృష్టి పడకుండా నిల్వ చేయడానికి మత్తు పదార్థాల అక్రమ రవణా చేసే ముఠాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఎక్సైజ్ అధికారులు చర్యలకు పూనుకున్నారు. నగరంలో మత్తుపదార్థాల రవాణాకు అటకట్ట వేసేందుకు నిఘా పెంచారు.

ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ప్రతి నిత్యం గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షిస్తూ అధికారులకు ప్రత్యేక ఆదేశాలిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో విక్రయించేందుకు తీసుకువచ్చిన 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో స్టేట్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ ఎస్పీ భాస్కర్ నేతృత్వంలో డీఎస్పీ తులా శ్రీనివాసరావు, ఇన్ స్పెక్ట‌ర్ వెంకటేశ్వర్లు ఒరిస్సా నుండి హైదరబాద్ లోని దూల్ పేటకు గంజాయిని తీసుకు వచ్చి నగరంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయడానికి తరలిస్తున్న క్రమంలో పక్కా సమాచారంతో పకడ్బందీ వ్యూహంతో దాడులు నిర్వహించి సుమారు 21కిలోల‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

దూల్ పేటకు చెందిన లకన్ సింగ్, ఇంద్రేష్ సింగ్, కైలాష్ సింగ్, శుభం సింగ్, గోల్కొండకు చెందిన ఆదిత్య సింగ్, ఒడిషాకు చెందిన జలేంద్ర హరిజన్, సురేష్ హరిజన్ లను అదుపులోకి తీసుకొని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు లకన్ సింగ్ గంజాయి అక్రమ వ్యాపారాన్ని తన ప్రధాన వ్యాపారంగా మలచుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతను గతంలో కూడా నేర చరిత్ర కలిగి పలు కేసుల్లో నిందితుడు. శుభం సింగ్ మీద కూడా గతంలో పలు కేసులున్నాయి. గంజాయి సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ హెచ్చరించారు. తనిఖీల్లో కె.వెంకటేశ్వర్లు, శివకృష్ణ, వేణు కుమార్, యూసుఫ్, మౌలా అలీ, లోకేష్, చిల్ల బాలరాజులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement