Monday, November 18, 2024

TS : అర్థ‌రాత్రి సీఎం ఇంటికి 200మంది విద్యార్థులు

అర్ధరాత్రి హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి సడన్‌గా 200 మంది విద్యార్థులు ఇంటి వ‌ద్ద‌కు చేరుకున్నారు. దీంతో ఒక్క‌సారిగా హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ స‌మ‌యంలో విద్యార్థులు ఇక్క‌డికి రావ‌డ‌మేంటని సిబ్బంది అంతా షాక్‌కి గుర‌య్యారు. సీఎం ఇంటి వ‌ద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు.

అస‌లు అక్క‌డ ఏం జ‌రిగిందంటే… అటెండెన్స్ తక్కువ ఉందన్న కారణం చేత కాలేజీ యాజమాన్యాలు తమకు హాల్ టికెట్స్ ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పుకునేందుకు సూర్యాపేట, సిద్దిపేట, నల్లగొండ, హైదరాబాద్ నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. బయో మెట్రిక్ విధానంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తక్షణమే విద్యాశాఖ అధికారులకు చెప్పి తమకు హాల్ టికెట్స్ ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

అయితే, రాత్రి సమయంలో సీఎం కలవడం కుదరదని సిబ్బంది విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఉదయం 10 గంటలకు వచ్చి సీఎంకు మీ సమస్యలు చెప్పుకోవచ్చని సూచించారు. కాగా, ఇప్పటికే పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement