రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు గేట్లు ఎత్తివేయడంతో ప్రాజెక్టు దిగువ భాగంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెంలోని నారాయణపురం వద్ద 20 మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు.
వరదలో చిక్కుకుని కూలీలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.. కాగా, బాధితులను రక్షించేందుకు సీఎంవోతో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంప్రదింపులు జరిపారు. హెలికాప్టర్ ద్వారా బాధితుల్ని రక్షించాలని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం, రెస్క్యూ టీమ్ సహాయ చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల సూచించారు.