ఎలుగుబంటి సంచారం కారణంగా శాతవాహన విశ్వవిద్యాలయంకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. ఈ నెల 14, 15 తేదీలలో సెలవు ప్రకటిస్తూ విశ్వవిద్యాలయం రిజిస్టర్ అదివారం ప్రకటన విడుదల చేసారు. గత మూడురోజులుగా ఎలుగుబంటి సంచరిస్తుండటంతో విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్న నేపథ్యంలో సెలవు ప్రకటించారు. అటవీశాఖ రిస్కు టీమ్ క్యాంపస్ లో అడ్డవేసి ఎలుగుబంటు వేటలో పడింది. 200 ఎకరాలు ఉన్న క్యాంపస్ లో బంటి ఆచూకీ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. వరంగల్ నుండి మత్తు ఇంజుక్షన్ లను కుడా తెపించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement