Thursday, November 21, 2024

Cash Seized : రూ. 2.18 కోట్ల నగదు పట్టివేత.. ఆ అభ్య‌ర్థివేనా అని అనుమానాలు

పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ భారీగా నగదు పట్టుబడుతుంది. తాజాగా సోమవారం తెల్లవారుజామున పెద్దపల్లి జిల్లా ఎన్ టి పి సి పట్టణంలోని కృష్ణ నగర్ లో ఓ ఇంట్లో నిలువ ఉంచిన 2.18 కోట్ల రూపాయల నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సీజ్ చేశారు.

నిన్న రాత్రి బి పవర్ హౌస్ వద్ద 50 లక్షల రూపాయల నగదు పట్టుబడుగా, సి విజిల్ లో వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు కృష్ణానగర్‌లోని ఓ ఇంటిలో తనిఖీలు నిర్వహించి భారీగా నగదు పట్టుకున్నారు. పట్టుబడిన నగదు రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చెందిన నగదుగా భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement