తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో పలు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. నిజామాబాద్ జిల్లాల్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు భారీగా వరద ప్రవాహం వస్తున్నది. ఇప్పటికే జలాశయం పూర్తిస్థాయిలో నిండడంతో అధికారులు 16 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయానికి 70వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఔట్ ఫ్లో 49వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1090 అడుగులుగా ఉన్నది. గరిష్ఠ నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు గాను దాదాపు పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉంది.
ఇది కూడా చదవండి: తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంపు?