Friday, November 22, 2024

శ్రీరాం సాగ‌ర్ ప్రాజెక్టుకు మ‌ళ్లీ వ‌ర‌ద పోటు – 16 గేట్లు ఎత్తివేత ..

నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాం సాగ‌ర్ ప్రాజెక్టుకు మ‌ళ్లీ వ‌ర‌ద ప్ర‌వాహం పెరిగింది. దీంతో ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 52,548 క్యూసెక్కులు ఉండ‌గా, ఔట్ ఫ్లో 52,548 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 1,090 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 1,091 అడుగులుగా ఉంది. ప్ర‌స్తుత నీటి నిల్వ సామ‌ర్థ్యం 84.81 టీఎంసీలు, పూర్తి నీటి నిల్వ సామ‌ర్థ్యం 90 టీఎంసీలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement