Sunday, November 24, 2024

బీహెచ్‌ఈఎల్‌ ఫ్లై ఓవర్‌కు రూ.130.65 కోట్లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పూణే-హైదరాబాద్‌ (ఎన్‌హెచ్‌-65) రహదారి బీహెచ్‌ఈఎల్‌ జంక్షన్‌లో 1.65 కిలోమీటర్ల ఫ్లై ఓవర్‌ మంజూరైంది. అయితే ఇందుకు రూ.130.65 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రాజెక్టును ఈ ఏడాది ఏప్రిల్‌ 29వ తేదీన శంషాబాద్‌ దగ్గర జరిగిన ఓ కార్యక్రమంలో నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

గత కొన్నేళ్లుగా ఈ మార్గంలో ఫ్లై ఓవర్‌ నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. తాజాగా ఈ ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసింది. హైదరాబాద్‌ నుంచి జహీరాబాద్‌, నాగ్‌పూర్‌, పూణలోని పారిశ్రామిక కారిడార్‌కు నిత్యం వేల సంఖ్యలో గూడ్స్‌ వెహికిల్స్‌తో పాటు సాధారణ వాహనాలు వెళ్తుండటంతో బీహెచ్‌ఈఎల్‌ దగ్గర తీవ్రంగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంజూరైన ఈ ఫ్లై ఓవర్‌ నిర్మాణంతో ఇక ట్రాఫిక్‌ సమస్య తగ్గుముఖం పట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement