Friday, November 22, 2024

TS | మొదటి రోజు టీచర్ల బదిలీల దరఖాస్తులు 1262

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఆదివారం నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు 1262 మంది ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వాటికి ఎడిట్‌ చేసుకున్న వారు 27,929 మంది ఉన్నట్లు వెల్లడించారు. దరఖాస్తుల సమర్పణకు గడువు ఈనెల 5వ తేదీ వరకు ఉన్నది.

అక్టోబర్‌ 3వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. మొదటగా ఈనెల 15న గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్లకు బదిలీలు చేపడుతారు. ఆ తర్వాత స్కూల్‌ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా పదోన్నతలు కల్పిస్తారు. ఆ తర్వాత స్కూల్‌ అసిస్టెంట్లకు బదిలీలు చేపడతారు. అనంతరం ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తారు. ఆతర్వాత అక్టోబర్‌ 3న ఎస్జీటీలకు బదిలీలు నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement