Friday, November 22, 2024

Breaking: కలుషిత నీరు తాగి.. 11 మందికి అస్వస్థత

కలుషిత నీరు తాగి 11 మంది అస్వస్థతకు గురైన ఘటన తెలంగాణలోని నారాయణపేట మద్దూర్‌ మండలం మోమినాపూర్‌లో చోటుచేసుకుంది. కలుషిత బోరు నీరు తాగి 11 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన బాలిక అనితను నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మద్దూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 8మంది చికిత్స పొందుతున్నారు. గ్రామాన్ని సందర్శించిన డీఎంహెచ్‌వో వెంటనే హెల్త్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement