ఈ నెల18 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు పరీక్షకు హాజరయ్యేందుకు సమయపాలనను ఎస్ఎస్‌సీ బోర్డు నిర్ణయించింది. విద్యార్థులు పరీక్ష సమయానికంటే 5నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఇంతుక మించి లేటుగా వస్తే మాత్రం పరీక్ష కేంద్రంలోకి పంపించబోమని స్పష్టం చేసింది.
- Advertisement -
ఇందుకు సంబంధించి బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. చివరి నిమిషంలో ఇబ్బంది తలెత్తకుండా విద్యార్థులు పరీక్షా సమయానికంటే ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు రావాలని బోర్డు సూచించింది. గతంలోలా ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా చూసేందుకు బోర్డు పలు చర్యలు తీసుకుంది. పేపర్ కోడ్, సబ్జెక్టు, మీడియం వంటివి తప్పుగా వచ్చినట్టైతే వెంటనే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులను సంప్రదించాలని సూచించింది.