తెలంగాణలో నేటి నుంచి పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 కి పదోతరగతి పరీక్షలు ప్రారంభంగానున్నాయి. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11వేల 469 పాఠశాలలకు చెందిన 5లక్షల 8వేల 385 మంది పరీక్షలు రాయనున్నారు.
వీరిలో 2లక్షల57వేల 952 మంది బాలురు కాగా 2 లక్షల 50వేల 433 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 2676 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. 30వేల మంది ఇన్విజిలేటర్లు పరీక్షా విధులు నిర్వర్తించనున్నట్టు ప్రకటించింది.అయితే పరీక్షా కేంద్రాలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షా కేంద్రాలకు అనుమతించనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది.
- Advertisement -