Friday, November 22, 2024

TS: నవజాత శిశువుల కోసం 108 ప్రత్యేక వాహనం.. మంత్రి గంగుల

జిల్లాలో నవజాత శిశువులను సంరక్షించి, వారు వ్యాధుల బారిన పడకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం నవజాత శిశువుల కోసం ప్రత్యేక 108 వాహనాలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శనివారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కేంద్రంలోని మాతశిశు ఆరోగ్య కేంద్రం వద్ద అత్యాధునిక సాంకేతిక‌త‌ సదుపాయాలు కలిగిన 108 వాహనాన్ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ తో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… నవజాత శిశువులకు వ్యాధులు సంక్రమణ అవకాశాలు అధికంగా ఉంటాయని, అలాంటి పరిస్థితుల్లో వారికి మెరుగైన వైద్యం అందించడానికి ఇతర అసుపత్రులకు తరలించే క్రమంలో అనారోగ్యం కారణంగా ఇబ్బందులకు గురికాకుండా ఉన్నతస్థాయి సంరక్షణను అందించేలా అధునాతన వెంటిలేటర్, పర్యవేక్షణ సామర్థ్యాలతో పీడీ యాట్రిక్ ఐ ఎఫ్ టి అనే ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వాహనంలో 14 రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై.సునీల్ రావు, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ డాక్టర్.బి గోపి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరిండెంట్ కృష్ణ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లలితాదేవి, ఆర్ఎంఓ డాక్టర్ జ్యోతి, వైద్యాధికారులు, ప్రజాప్రతినిదులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement