132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీ వాసుదేవ పీఠం ఆధ్వర్యంలో, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, 108 దీప లక్ష్మీల పూజా విధానం, పుస్తకాన్ని 132 జీడిమెట్ల డివిజన్ మాజీ కార్పొరేటర్ కూన పద్మ ప్రతాప్ గౌడ్ ఆవిష్కరించారు. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ధర్మకర్త ఠాకూర్ రాజేందర్ సింగ్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సామల నరసింహారెడ్డి, శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన అర్చకులు వెంకట శేషాచార్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్తీక మాసం సందర్భంగా రాధికా కర్ణాటక సంగీత కచేరి వారు సంగీత కచేరిని నిర్వహించిగా, వారిని ప్రోత్సహించేందుకు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సామల రాఘవ రెడ్డి, గ్రామ ప్రజలు, రాధికా కర్ణాటక సంగీత కచేరి కార్యక్రమంలో సంగీతం ఆలపించిన చిన్నారులు స్రుతి, కోమలి, జానకి ప్రియా, నిహారిక, సహస్ర, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..