Tuesday, November 26, 2024

హైద‌రాబాద్ లో 1000 ప‌డ‌క‌ల క‌రోనా సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి : హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ లోని ఫ్రూట్ మార్కెట్ వ‌ద్ద 1000 ప‌డ‌క‌ల క‌రోనా సూపర్ స్ప‌షాలిటీ ఆస్ప‌త్రి వ‌స్తుంద‌ని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు. ఆయ‌న మాట్లాడుతూ…. కరోనా కేసుల వైద్యం కోసం.. అదనపు పడకలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలిచ్చారని.. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌నే విధంగా 1400 పడకలు హైద‌రాబాద్ లో ఏర్పాటు చేయనున్న‌ట్లు తెలిపారు. నిలోఫర్ లో 800 పడకలు ఏర్పాటు చేస్తున్నామని.. మరో 6 ఆస్ప‌త్రుల్లో 100 పడకల చొప్పున ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

అందులో భాగంగా వనస్థలిపురంలో 100 పడకలు ఏర్పాటు చేసుకున్నామని.. అందరూ కోవిడ్ జాగ్రత్తలు పాటించి, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 24 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లను అందుబాటులో ఉంచుకున్నామని.. పేదల వైద్యం కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్రం ప్రకటన చేసిందని గుర్తు చేశారు. పేదలకు అన్ని రకాల వైద్య సేవలందించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారని చెప్పారు. హైదరాబాద్ లోని ఫ్రూట్ మార్కెట్ వద్ద 1000 పడకల సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రికి త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా.. దాని తీవ్రత తక్కువేనని ఆయన తెలిపారు. మన బస్తీ దవాఖాన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని హ‌రీశ్ రావు అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement