ప్రతి నియోజకవర్గంలో దళిత బంధుకు 100 మందిని ఎంపిక చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళిత బంధుపై రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ…..రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయనున్నట్లు తెలిపారు. బ్యాంకు లింక్ తో సంబంధం లేకుండా రూ.10లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్ ను ఎంపిక చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే వాసాలమర్రి, హుజూరాబాద్ లో దళిత బంధు ప్రారంభమైనట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..