నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో 100 పడకల ఐసీయూ వార్డును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్న పిల్లల్ల వార్డులను మంత్రి హరీశ్‌రావు సందర్శించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. హైసీయా , నిర్మాణ్ సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు ముందుకు రావడం మంచి విషయం అని హరీశ్‌రావు అన్నారు.రాబోయే రోజుల్లో రూ. 10 వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్య శాఖను అభివృద్ధి చేస్తామన్నారు. కరోనా మూడో వేవ్ అంచనాల నేపథ్యంలో ప్రత్యేకంగా చిన్నారుల కోసం 5000 పడకలు ఏర్పాటు చేశామన్నారు. దీని కోసం సీఎం రూ. 133 కోట్లు విడుదల చేశారని హరీశ్ రావు తెలిపారు. రూ. 33 కోట్లతో నిలోఫర్‌లో మరో 800 పడకలు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
100 పడకల ఐసీయూ వార్డును ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
Advertisement
తాజా వార్తలు
Advertisement