Thursday, November 14, 2024

Swetha Patram: ప‌దేళ్ల‌లో అప్పులు రాష్ట్రంగా మార్చిన ఘ‌న‌త బిఆర్ఎస్ దేః ఆర్ధిక శ్వేత ప‌త్రంలో వెల్ల‌డి

అమ‌రావ‌తి – తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. మొత్తం 42 పేజీలతో ఉన్న శ్వేత‌ప‌త్రాన్ని ఆర్థిక మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు.. కాగా తెలంగాణలో మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లు అని తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి రాష్ట్రం అప్పులు రూ.72,658 కోట్లు అని పేర్కొం ది. పదేళ్లలో సగటున 24.5 శాతం రాష్ట్ర అప్పులు పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లు అని ప్రభుత్వం పేర్కొంది.

ప్రభుత్వ కార్పొరేషన్లలో తీసుకున్న అప్పులు రూ.59వేల 414 కోట్లు అని తెలిపింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు రుణ భారం పెరిగిందని శ్వేత ప‌త్రంలో వెల్ల‌డించింది. రెవెన్యూ రాబడిలో 34 శాతానికి రుణ చెల్లింపుల భారం పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది. రెవెన్యూ రాబడిలో 35 శాతం ఉద్యోగుల జీతాలకు వ్యయం అవుతున్నట్లు స్పష్టం చేసింది.

2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పంగా ఉందని పేర్కొంది. 2023-24 నాటికి రుణ, జీఎస్టీపీ 27.8 శాతానికి పెరిగిందని తెలిపింది. బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20 శాతం అంతరం ఉన్నట్లు సర్కారు క్లారిటీ ఇచ్చింది. 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ.4.98 లక్షల కోట్లు వ్యయం అయినట్లు వెల్లడించింది. ప్రతి రోజూ వేస్ అండ్ మీన్స్‌పై ప్రభుత్వం ఆధారపడాల్సిన దుస్థితి ఉందని స్పష్టం చేసింది. 2014లో తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉందని శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొంది. కాగ్ నివేదికలోని కీలక అంశాలను శ్వేతపత్రంలో పొందుపరిచినట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

శ్వేతపత్రంలోని ప్రధానాంశాలు..
రాష్ట్ర మొత్తం అప్పులు ₹6,71,757 కోట్లు.
2014-15 నాటికి రాష్ట్ర రుణం ₹72,658 కోట్లు.
2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం పెరిగిన అప్పు.
2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం ₹3,89,673 కోట్లు.
2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం.
2023- 24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ శాతం.
బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం.
57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి ₹4.98 లక్షల కోట్ల వ్యయం.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం.
రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిన రుణ చెల్లింపుల భారం
రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం

Advertisement

తాజా వార్తలు

Advertisement