Monday, November 18, 2024

చెల్లని చెక్కు ఇచ్చినందుకు 10 నెలల జైలు శిక్ష.. పెద్ద‌ప‌ల్లి కోర్టు తీర్పు

చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి 10 నెలల జైలు శిక్ష తో పాటు మూడు లక్షల రూపాయలు బాధితురాలికి కట్టాలని పెద్దపెల్లి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ జడ్జి కె. రాణి బుధవారం తీర్పునిచ్చారు. పెద్దపల్లికి చెందిన నాగుల వెంకట లక్ష్మి వద్ద మెతుకు గణపతి రెడ్డి రెండు లక్షల రూపాయలు తీసుకొని అందుకుగాను చెక్కు ఇవ్వగా అది బ్యాంకులో చెల్లక పోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది.

ఈ మేరకు విచారణ జరిపిన న్యాయ మూర్తి బాధితురాలు వెంకట లక్ష్మీ కి లక్షల రూపాయలు చెల్లించాలని, దీంతో పాటు పది నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. చెల్లని చెక్కులు ఇవ్వడం చట్టరీత్యా నేరమని జడ్జి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement