నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహంతో నిండు కుండలా మారింది. పూర్తి స్థాయి నీటిమట్టం చేరడంతో అధికారులు 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1,29,791 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 590 అడుగులు. గరిష్ఠ నీటి నిల్వ 312.0405 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుత నీటినిల్వ 312 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో పర్యటకు తాకిడి పెరుగుతోంది. శని, ఆదివారం సెలవు కావడంతో సాగర్ వద్ద సందర్శకులు వస్తున్నారు.
ఇది కూడా చదవండి: నాన్ స్టాప్ బాదుడు.. రూ.110కి చేరువలో పెట్రోల్ ధర