Friday, November 22, 2024

ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో రెండు స్థానాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. సాయంత్రం 4 గంటల సమయానికి క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు.

ఇక మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారంటూ సీపీఐ ఆరోపించింది. ఈ సందర్భంగా సీపీఐ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇక, నల్గొండ జిల్లా ఎన్జీ కాలేజ్ లో ఏర్పాటు చేసిన బూత్ నెం.30లో బీజేపీ ఏజెంటుపై టీఆర్ఎస్ నేతలు చేయిచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఐడీ కార్డు లేకుండా ఏజెంటుగా ఎలా కూర్చుంటావంటూ టీఆర్ఎస్ నేతలు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ఘటనలు మినహా మొత్తమ్మీద పోలింగ్ ప్రశాంతంగానే సాగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement