Friday, November 22, 2024

భారీ వర్షాలు…ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – మంత్రి మహేందర్ రెడ్డి

వికారాబాద్ సెప్టెంబర్ 5 ( ప్రభ న్యూస్):భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు మంగళవారం విడుదల చేసిన ప్రకటన లో ఆయనగత రెండు రోజుల నుంచి కురుస్తున్న బారీ వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు వికారాబాద్జిల్లాలోని పాఠశాలలకు, కళాశాలలకు సెలవులను ప్రకటించిన నేపథ్యంలోఅవసరమైతే తప్ప ప్రజలు బయటికి రారాదని అన్నారు.వాగులు, వంకలు నీటితో నిండి పొర్లుతున్నందునా రైతులు పొలాల్లోకి అవసరమైతే తప్ప వెళ్ళరాదన్నారు.కరెంటు స్తంభాలను, తీగలను ముట్టుకోవద్దని చెప్పారు.జిల్లాల్లో కలెక్టర్ తో పాటు అధికారులందరూ స్థానికంగా ఉండి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశించారు.

వైరల్ ఫీవర్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండండి.ఇంటి పరిసరాల్లో దోమలు చేరకుండా ఉండేందుకు డ్రైనేజీ వాటర్ నిలవకుండా చూసుకోవాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement